teluguleads.in
Newspaper Banner
Date : 16 April 2026, 1:54 pm Posted By : TELUGU LEADS

బిస్కెట్ లో విషమిచ్చి       ఇద్దరు పిల్లలను చంపేందుకు ఓ కసాయి తండ్రి కుట్ర

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ఆస్తి కోసం ఓ కసాయి తండ్రి తన రెండో భార్యతో కలిసి సుపారీ ఇచ్చి తన మొదటి భార్యకు కలిగిన ఇద్దరు కుమారులను హత్య చేసేందుకు పునుకున్నాడు. రఘునాథపల్లి ఎస్సై దూది మెట్ల నరేష్ కథనం ప్రకారం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ కు అనితతో 2016లో వివాహం అయింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. ఈ క్రమంలో గత సంవత్సరం బానోత్ శ్రీనివాస్ దుబ్బ తండాకు చెందిన మూడవత్ మమతను రెండో వివాహం చేసుకోగా,కుల పెద్దలు సదురు శ్రీనివాస్ కు ఉండబడిన 20గుంటల వ్యవసాయ భూమిని తన ఇద్దరు పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని తీర్మానించినారు. ఆట్టి వ్యవసాయ భూమినే నమ్ముకుని శ్రీనివాస్ మొదటి భార్య అనిత వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలను చదివించుకుంటుంది. ఇదిలా ఉంటే భానోత్ శ్రీనివాస్ ఆయన రెండవ భార్య మమత కలిసి ఆ 20గుంటల భూమిని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో కుట్ర పన్ని వారు ఇద్దరు కలిసి ఓ వ్యక్తికి ఫోన్ చేసి విషం కలిపిన బిస్కెట్లను తన పిల్లలు స్కూలుకు వెళుతుండగా కానీ, ఇంటికి వస్తుండగా కానీ వారికి ఇవ్వాలని శ్రీనివాస్, మమతలు కోరారు. అందుకు ప్రతిఫలంగా అతనికి కొంత డబ్బు ఇస్తామని చెప్పగా అతను భయపడి శ్రీనివాస్ మొదటి భార్య అనితకు ఈ విషయం చెప్పాడు. శ్రీనివాస్ మొదటి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బానోత్ శ్రీనివాస్,మూడవత్ మమతను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు పంపారు. కాగా, జనగామ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి.శశి వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కు ఆదేశించడం జరిగింది.