
హైదరాబాద్,మార్చి 24,(లీడ్స్ న్యూస్): జనహిత సేవా ట్రస్ట్,అప్సా,కిమ్స్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బేగంపేట పాటిగడ్డలోని వడ్డెర బస్తీ కమ్యూనిటీ హాలులో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి కిమ్స్ హాస్పిటల్ నుండి జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్ డాక్టర్లు హాజరై 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి,ఆరోగ్య సలహాలను,మందులు అందజేశారు. భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో మహిళలకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పరీక్షించి, రక్తహీనత ఉన్నవారికి ఐరన్ మాత్రలను అందజేశారు. ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ ఎం.శ్రీనివాస్ మోకాలు నొప్పులు,నడుము నొప్పులు ఉన్నవారికి ఎక్సర్ సైజులను చూపించారు. ఈ శిబిరంలో అప్సా ప్రోగ్రాం మేనేజర్ ఎం. బస్వరాజ్, కోఆర్డినేటర్ లు బి.రమేష్, రాజేశ్వరి, శోభ, బుగ్గయ్య, లావణ్య,,శ్రావణి, మల్లిక, ఇందిరా,ఐ ఫౌండేషన్ క్యాంప్ కో ఆర్డినేటర్లు రాహుల్,నవ్య,నర్సింగ్ రావు, విక్రమ్, బస్తీ మహిళా మండలి నాయకురాలు నారాయణ, నర్సింహ, వరలక్ష్మీ, లలిత, రాజు, బస్తి నాయకులు పాల్గొన్నారు.
