teluguleads.in
Newspaper Banner
Date : 10 October 2026, 6:34 pm Posted By : TELUGU LEADS

భారీగా ఎస్ఐల బదిలీలు

లీడ్స్ న్యూస్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా ఎస్ఐల బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలో  35 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ కమిషనర్ శ్వేత శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. గత మూడు నెలలుగా ఎస్ఐల బదిలీలు జరుగుతాయని చర్చ జరుగుతుండగా ఎట్టకేలకు విజయదశమి పండుగకు వారం రోజుల ముందుగా బదిలీలకు తెరపడింది. బదిలీ అయిన ఎస్ఐలను వెంటనే రిలీవ్ చేయాలని సీఐలు,సంబంధిత ఎస్.హెచ్.ఓలను కమిషనర్ ఆదేశించారు.అందువల్ల వీరంతా వెంటనే బదిలీ అయిన ప్రాంతాల్లో విధుల్లో చేరనున్నారు. ఎక్కువమంది సోమవారం విధుల్లో చేరుకున్నట్లు తెలుస్తుంది.