teluguleads.in
Newspaper Banner
Date : 12 May 2026, 8:34 pm Posted By : TELUGU LEADS

భూ భారతి దరఖాస్తుల్లో వేగం పెంచాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్ :పెండింగ్ లో ఉన్న భూ భారతి దరఖాస్తులపై దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. మంగళవాం భూ భారతి పెండింగ్ దరఖాస్తులపై అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ తో కలిసి అయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ దరఖాస్తులపై క్షుణ్ణంగా అడిగి టీజెలుసుకున్నారు.కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతిలో గల వివిధ మాడ్యూల్స్ లోని సక్సెషన్,మ్యుటేషన్, ఖాతా సమీకరణ,డేటా కరెక్షన్,అర్బన్ ల్యాండ్, కోర్టు కేసులు,జీపీపీ, పీపీబీ,నాలా తదితర పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని సూచించాలని, అలాగే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ – ఆఫీసు విధానాన్ని అమలు చేసి పరిపాలనలో పారదర్శకతను,వేగాన్ని పెంచాచాలన్నారు. అలాగే SIR పై మ్యాపింగ్ చేసుకుని ఎప్పటికేప్పుడు పని పూర్తి చేయాలని, దాన్యం విషయంలో మిల్లర్లు జాప్యం చేయకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే చేసుకోవాలని,అధికారులుఅన్ని మిల్లులను సందర్శించి సమస్యలు తేలేతకుండా చూడాలన్నారు. ఈ సామావేశాల్లో ఆర్డివో గోపిరాం, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు.