మన దినచర్యలో మార్పు అవసరం
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత వరంగల్,లీడ్స్ న్యూస్:సమాజం బాగుండాలంటే మనం బాగుండాలి, మనం బాగుండాలంటే దిన చర్యలో మార్పు అవసరమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎస్. శ్వేత అన్నారు.వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం కమిషనరేట్ గ్రౌండ్‌లో నిర్వహించిన వారాంతపు పరేడ్‌ను ఆమె పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సిబ్బందిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, క్రమశిక్షణ,నిబద్ధత,శారీరక దృఢత్వంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలన్నారు. పోలీస్ లు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా ప్రతిరోజూ కొంత సమయం కేటాయించి...