మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్):మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని స్టేషన్ ఘన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.కలెక్టరేట్లో సోమవారం మహిళలు,పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించగ వారు పాల్గొన్నారు. కడియం మాట్లాడుతూ మహిళలు నేడు రాజకీయంగా,సామాజికంగా ఆర్థికంగా ముందడుగు వేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా...