మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా తీసుకోవాలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్స్ ప్రతినిధి,హైదరాబాద్మహిళల రక్షణను సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు తీసుకొని వారికి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో 'స్టాండ్ ఫర్ విత్ హర్' పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల పేరు మీద అనేక సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతుందని, కుటుంబంలో రేషన్ కార్డు మంజూరు చేసినా మహిళా పేరుమీద ఇస్తున్నామని చెప్పారు. ఇది మా ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని చెప్పారు. సమాజంలో...