teluguleads.in
Newspaper Banner
Date : 02 June 2026, 7:47 am Posted By : TELUGU LEADS

మహిళా ఉద్యోగి ఫోటోలు మార్ఫింగ్

ఆపై సోషల్ మీడియా ద్వారా వేధింపులు

నిందితుడి రిమాండ్

పోలీసుల అదుపులో విజయ్ రెడ్డి

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి వ్యక్తిగత ఫోటోలను రహస్యంగా తీసి,ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆమెను మానసికంగా వేధించిన ఘటన జనగామలో సోమవారం వెలుగులోకి వచ్చింది.జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి కథనం ప్రకారం.. డిఏఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓ విజయ్ రెడ్డి తోటి మహిళా ఉద్యోగి ఫోటో లను ఆమెకు తెలియకుండా తీసి తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించాడు. అంతే కాదు ఆమెను మానసికంగా వేధింపులకు గురించేశాడు. అతని చేష్టలతో విసిగి పోయిన అ మహిళా సోమవారం జనగామ పోలీస్లకు ఫిర్యాదు చేసింది.పోలీస్ లు తీగలాగి డొంక కదిలించారు. విజయ్ రెడ్డి సోషల్ మీడియా ఖాతాలను, సదరు మహిళా ఉద్యోగి ఫోటోలను విజయ్ సోషల్ మీడియా ఖాతాలో గుర్తించారు. పోశ్ యాక్ట్ 2013 ప్రకారం మహిళా ఉద్యోగుల సెక్సువల్ హరాస్మెంట్ నేరం కింద విజయ్ పై కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో రిమాండ్ చేశారు. తోటి ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాల్సిన ఏవో తీరుపై సర్వత్ర మండిపడుతున్నారు. ఇతన్ని కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. వర్క్ ప్లేస్ లో మహిళా ఉద్యోగులను ఎవరైనా వేధించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.