teluguleads.in
Newspaper Banner
Date : 01 March 2026, 10:12 pm Posted By : TELUGU LEADS

మహిళా సమస్యల పరిష్కారానికి భరోసా..

– రాష్ట్ర డిజిపీ శివధర్ రెడ్డి..

– జనగామలో భరోసా,షీ టీం సెంటర్లు అందుబాటులో

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్) : పోలీస్ వ్యవస్థ పట్ల నమ్మకం పెంచి మహిళలకు భరోసా కల్పించడంకోసం జనగామలో భరోసా, షీ టీం సెంటర్ లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన భరోసా సెంటర్, షీ టీమ్ కార్యాలయాలను అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరోసా సెంటర్ ద్వారా బాధ్యత మహిళలకు సేవలు అందుతాయి అన్నారు. భరోసా కేంద్రాలు రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి సేవలందించడం జరుగుతుందన్నారు.
పోలీస్ స్టేషన్లకు రాలేని పరిస్థితుల్లో భరోసా కేంద్రాలకు న్యాయం కోసం మహిళలు రావచ్చన్నారు. ఈ కేంద్రాలలో డాక్టర్లు,
సైకాలజిస్ట్,లాయర్లు అందుబాటులో ఉంటారన్నారు. పోలీస్ స్టేషన్లో చార్జ్ షీట్ నమోదు నుండి కోర్టులో సబ్మిట్ చేసే అంతవరకు. బాధితుల వీరు వెంట ఉంటారని తెలిపారు. లైంగిక వేధింపులు, గృహ హింస, పోక్సో కేసుల బాధితులకు ఒకే చోట వైద్య, న్యాయ, మానసిక సహాయం అందించడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మహిళల రక్షణ కోసం నిరంతరం పనిచేసే షీ టీమ్స్ కోసం అత్యాధునిక వసతులతో కూడిన ప్రత్యేక కార్యాలయాన్ని ఇక్కడ అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్,వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.