ఒకరికి రూ. లక్ష పెనాల్టీ

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: జిల్లాలో అపరిశుభ్రమైన మాంసం విక్రయ దుకాణ దారులపై అధికారులు కొరడా గెలిపించారు. జనగామ పట్టడంతో పాటు,పలు మండల కేంద్రాల్లో, గ్రామాల్లో వ్యాపారులు ఇష్టారాజ్యంగా గొర్రెలు,మేకలను వధిస్తూ అపరిశుభ్రమైన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగా ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ సిమ్లా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో అధికారులు మటన్ వ్యాపారులపై దాడులు నిర్వహించారు. మాంసపు విక్రయ కేంద్రాలు,అక్రమ వధలు చేపట్టడంతో పాటు,అనుమతి లేని,అపరిశుభ్రత కలిగిన మాంసం విక్రయాలను గుర్తించి పట్టణంలోని ప్రముఖ మాంసపు వ్యాపారి కరణ్ కు రూ. లక్ష జరిమానా విధించారు. అయితే, పశువైద్య శాఖ అధికారులు లేదా వారు నియమించిన అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఆరోగ్య కరమైనటువంటి గొర్రెలు,మేకల మాంసాన్ని విక్రయించాలని సూచించారు. అదేవిధంగా పరిశుభ్రత పాటించక పోయిన చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా ఏమాత్రం ఉన్న వారిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలిపారు. ఈ దాడుల్లో మున్సిపల్ కమిషనర్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లాలోని రఘునాథపల్లి నర్మెట,లింగాలగణపురం,స్టేషన్గన్పూర్, బచ్చన్నపేట మండల కేంద్రాలు,గ్రామాల్లో కూడా అధికారులకు మాంసం విక్రయాలపై అనేక ఫిర్యాదులు ఇప్పటికే అధికారులకు అందినప్పటికీ వారు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల అధికారులు జిల్లాలో దాడులు నిర్వహించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని పలురు మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
