teluguleads.in
Newspaper Banner
Date : 04 March 2026, 8:59 pm Posted By : TELUGU LEADS

మావోయిస్టు అగ్ర నేత లొంగుబాటు?

లీడ్స్ ప్రతినిధి,హైదరాబాద్,
మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బుధవారం సాయంత్రం లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయన లొంగుబాటు అనంతరం కేంద్రానికి అప్పగించనున్నారని తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా సారంగపూర్‌కు చెందిన గణపతి నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక భూమిక పోషింస్తున్నాడు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తరువాత ఆయన తొలి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అలాగే నక్సలైట్ ఉద్యమ పార్టీలన్నీ మావోయిస్టు పార్టీగా ఏర్పాటు అయ్యేందుకు ఈయన ఎంతో గాను కృషి చేసినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన నేపాల్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డిలు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమీషాతో బుధవారం సాయంత్రం సమావేశం కావడం ఈ వార్తకు కొంత ప్రాధాన్యత చేకూరుస్తుంది. అయితే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అప్పుడే దీనిపై స్పష్టత రానుంది.