జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశం ఈ సాయంత్రం ముగిసింది. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టనున్న ‘ప్రజా పాలన – ప్రగతి’ ప్రణాళిక కార్యక్రమం పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల అమలుపై పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జనగామ జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇటీవల బదిలీపై వెళ్లిన కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కూడా హాజరయ్యారు.