teluguleads.in
Newspaper Banner
Date : 30 March 2026, 12:31 pm Posted By : TELUGU LEADS

ముదురుతున్న పాడి కౌశిక్ రెడ్డి వివాదం

బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్

కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మతో కాంగ్రెస్ శ్రేణులు

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ సాక్షిగా కడియం శ్రీహరి పట్ల అనుచితంగా వ్యవహరించిన తీరు వివాదాంగా మారింది. ఆదివారం శాసనసభలో కడియం మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ సర్కారు చేసిన భూకబ్జాలపై హౌస్ కమిటీ వేయాలని కడియం చెప్పారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి కడియం వైపు చూస్తూ గన్నుతో కాల్చి పడేస్తా అన్నట్లుగా అభ్యంతరకరంగా సైగ చేయడం తీవ్ర డుమరాన్ని లేపింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి వ్యవహార తీరును ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ రావును కోరారు. ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ లేకపోవడంతో ఈ శాసనసభ సమావేశాలు ముగిసేలోపు ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేసి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. దీన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు సీఎం సూచించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల రూల్ బుక్ ను సీఎం చదివి అనుసరించాల్సిన ప్రొసీజర్స్ ని సభకు వినిపించారు. లంచ్ విరామం తరువాత శాసనసభ తిరిగి ప్రారంభమయ్యాక ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మంత్రులు వివేక్ వెంకటస్వామి, అట్లూరి శ్రీనివాస్,అజారుద్దీన్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి,యశస్విని రెడ్డి పలువురు దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సామెల్,బాలు నాయక్ రాములు,వేముల వీరేశం తదితరులు కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా మాట్లాడారు. కడియంకు వెంటనే కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ముక్తకంఠంగా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేయాలని సభలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై సభా క్రమశిక్షణ చర్యలు తప్పవేమో అన్న సంకేతలు వెలుబడుతున్నాయి. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం పాడి కౌశిక్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. కడియం సొంత నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. కడియంను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సభలో వ్యంగ్యంగా సైగలు చేస్తూ అభ్యంతరకరంగా వ్యవహరించడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నామని జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్ చందర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ స్టేషన్గన్పూర్, రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షులు శిరీష్ రెడ్డి కోళ్ల రవి తదితర పార్టీ శ్రేణులు అంటున్నాయి. చూడాలి మరీ దీనిపై ఎథిక్స్ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.