teluguleads.in
Newspaper Banner
Date : 06 August 2026, 8:55 pm Posted By : TELUGU LEADS

మొక్కలు నాటారు

లీడ్స్ ఎఫెక్ట్

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండలం  జాఫరగూడెం గ్రామంలోని బిఎంఆర్ రైస్ మిల్ ప్రాంతంలో వృధాగా చెట్ల పొదల్లో పడేసిన మొక్కలను అధికారులు గురువారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. ‘పెంట పాలవుతున్న మొక్కలు’ అనే శీర్షికన ‘లీడ్స్ న్యూస్’ లో గురువారం ఉదయం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంపీడీవో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి మధును ఆదేశించడంతో అయన వాటిని వెంటనే స్వాధీనపర్చుకుని ఫీల్డ్ అసిస్టెంట్ నర్సయ్యకు అప్పగించి గ్రామంలో రోడ్ల పక్కన నాటించారు. కాగా, లీడ్స్ న్యూస్ కథనం పట్ల స్థానిక అధికారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.