లీడ్స్ న్యూస్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుసగా మూడు రోజులు సెలవులు కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. అయితే ప్రత్యేక దర్శనానికి 30 నిమిషాలు, ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా దేవస్థానం బోర్డు అన్ని చర్యలు చేపట్టింది.