డీజీపీ సీవీ. ఆనంద్ వార్నింగ్
లీడ్స్ న్యూస్, హైదరాబాద్: పోలీసు అధికారులు, సిబ్బంది ఎవరైనా యూనిఫామ్‌లో ఉన్నప్పుడు స్టెప్పులేసి డాన్సులు చేయొద్దని డిజిపి సివి. ఆనంద్ హెచ్చరించారు. కొంతకాలంగా వివిధ సందర్భాల్లో పోలీసులు ఆన్ డ్యూటీ లో ఉన్న సమయంలో యూనిఫామ్‌లోనే డ్యాన్స్ వేసిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. గతంలో పోలీస్ శాఖ అధికారులకు ఈ రకమైన హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఉన్నత స్థాయి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించారు. పోలీసు సిబ్బంది డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాంటి చెడు సంఘటనలు జరగపోతే సరే కానీ, జరగకూడని సంఘటనలు జరిగినట్లయితే పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల ప్రస్తుతం ఇలాంటి సంఘటనల పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావం నెలకొనడంతో యూనిఫామ్‌లో ఉన్నప్పుడు డ్యాన్సులు చేయడం, ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొనడం మానుకోవాలని డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
పోలీసు యూనిఫామ్ బాధ్యత,అధికారం, క్రమశిక్షణకు ప్రతీక అని, దాని గౌరవాన్ని కాపాడాలని ఆయన స్పష్టం చేశారు.