teluguleads.in
Newspaper Banner
Date : 18 March 2026, 7:31 pm Posted By : TELUGU LEADS

రఘునాథపల్లిలో ఇఫ్తార్ విందు

రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని జిల్లా గ్రంథాలయ సంస్థ మారుజోడు రాంబాబు అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు రఘునాథపల్లిలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం తహసిల్దార్ బైరెడ్డి రాజేష్ రెడ్డి నేత్రుత్వంలో నిర్వహించగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి, పలువురు మండల రెవెన్యూ అధికారులు,ప్రజాప్రతినిధులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.