రఘునాథపల్లిలో భూమి సునీల్ పర్యటన

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు భూమి సునీల్ రెడ్డి శనివారం రఘునాథపల్లి మండలంలో పర్యటించారు. అయన మొదటగా శ్రీమన్నారాయణపురం,ఆ తర్వాత కన్నయ్యపల్లి గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలువురు సాదా బైనామాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని, అలాగే సక్సెషన్ ద్వారా భూమి రిజిస్ట్రేషన్ సమయంలో తలెత్తే సమస్యలను, పట్టా భూములు కొన్నిచోట్ల అధికారుల నిర్లక్ష్యంవల్ల ప్రభుత్వ భూమిక రికార్డుల్లో నమోదయ్యాయని వీటి క్లియరెన్స్ లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కొన్నిచోట్ల...