రఘునాథపల్లి సీఐగా వేణు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి రూరల్ సర్కిల్ సిఐగా జి. వేణు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందుగా ఇక్కడ పనిచేసిన సీఐ ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ సిసిఎస్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో వేణు స్టేషన్గన్పూర్ నుండి ఇక్కడికి వచ్చారు. క ఈ సందర్భంగా రఘునాథపల్లి  సర్కిల్ పరిధిలోని రఘునాథ పల్లి ఎస్ఐ దూది మెట్ల నరేష్ యాదవ్,లింగాలఘంపురం ఎస్ఐ బండి శ్రవణ్ కూమర్ లు,చిల్పూర్ ఎస్ఐ సిరిపురం నవీన్ కుమార్,పోలీస్ సిబ్బంది పలువురు నూతన సిఐని మర్యాదపూర్వకంగా కలిశారు.