
రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల గ్రామంలో మంగళవారం రాజకీయాల కతీతంగా భిన్న వర్గాల ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కులాలు,మతాలు,రాజకీయాలకు అతీతంగా స్థానికులు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ చైర్మన్ మంకెన అన్నపురెడ్డి,గ్రామ సర్పంచ్ వల్లాల అశోక్, ఉపసర్పంచ్ నర్రా అశోక్,ఏ.వై.ఏ అధ్యక్షులు కుమారస్వామి,మాజీ ఎంపీపీ మాజీ మేకల వరలక్ష్మి,నరేందర్,యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.