రిజర్వాయర్ నుండి నీటి విడుదల
బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద రాంబాబు తదితరులు రఘునాథపల్లి,(లీడ్స్ న్యూస్): రఘునాథపల్లి మండల రైతుల సంక్షేమం కోసం నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ నుండి మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీశ్ చందర్ రెడ్డిలు నీటిని విడుదల చేశారు. స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశాల మేరకు వారు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. పలు వాగుల ద్వారా మండలంలోని చెరువుల ను నింపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వరి పంటలు ఎండిపోకుండా ఉండేందుకు...