teluguleads.in
Newspaper Banner
Date : 19 March 2026, 11:20 pm Posted By : TELUGU LEADS

రుగ్మతలను తొలగించేందుకు సినిమ ఒక సాధనం

ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి

ఉత్తమ హీరోగా నాగచైతన్య(తండేల్ )

ఉత్తమ కథనాయకగా రష్మిక మందన( గర్ల్ ఫ్రెండ్)

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: సామాజిక రుగ్మతలను తొలగించేందుకు సినిమా ఒక మంచి సాధనం అని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి హైదరాబాదులోని హైటెక్ సిటీలో జరిగిన గద్దర్ ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఒకప్పుడు చెన్నై కేంద్రంగా ఉన్న సినీ పరిశ్రమ మొదటి తరం హీరోలు ఎన్టీఆర్,ఏఎన్నార్, కృష్ణ తదితర నటుల సహకారంతో హైదరాబాద్ కు రావడం జరిగిందని. సినీ పరిశ్రమను ఆదరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని,ఇందులో భాగంగానే పదేళ్లుగా నిర్వహించని నంది అవార్డులను గద్దర్ పేరుతో తిరిగి తీసుకురావడం జరిగిందన్నారు. హైదరాబాద్ బిర్యానికే ఫేమస్ కాదని, తెలుగు సినీ పరిశ్రమను కూడా దేశస్థాయిలో గుర్తింపు తెచ్చిన చరిత్ర మనకు ఉందన్నారు. ఒక బాహుబలి, పుష్ప ప్యాన్ ఇండియా సినిమాలు ఎన్నో ఉన్నాయన్నారు. కాబట్టి అంతే స్థాయిలో హైదరాబాదులో సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని ఉన్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని అనుమతులను ఆన్లైన్ ద్వారా తక్షణమే జారీ చేసేందుకు బట్టి విక్రమార్కకు సీఎం సూచనలు చేస్తున్నట్లు చెప్పారు. గద్దర్ ఒక యుద్ధ నౌక అని, ఎంతో మంది ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన పాత్ర ఉందన్నారు. తొలి,మలి దశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటల ప్రభావం ఎంతగానో ఉందన్నారు. రామోజీరావు లాంటి వ్యక్తులు కూడా హైదరాబాదులో ఫిలిం సిటీని నిర్మించి హాలీవుడ్ బాలీవుడ్ స్థాయిలో సినిమాల నిర్మించేందుకు హైదరాబాదు కేంద్ర బిందువుగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా మరోసారి సిని పరిశ్రమ నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,జూపల్లి కృష్ణారావు,సినీ ప్రముఖులు స్వర్గీయ ఎన్టీఆర్ అవార్డును చిరంజీవి, రఘుపతి వెంకయ్య అవార్డును కమలహాసన్, లక్ష్మీ కాంతారావు అవార్డును ఆర్ నారాయణ మూర్తి తదితరులు దక్కించుకోగా జయసుధ, నాగార్జున,బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. తండేల్ సినిమాకు గాను ఉత్తమ హీరోగా నాగ చైతన్య, గర్ల్ ఫ్రెండ్ సినిమాకు ఉత్తమ కథానాయకగా రష్మిక మందన ఈ అవార్డులను దక్కించుకున్న వారిలో బన్నారు.