హైదరాబాద్, లీడ్స్ న్యూస్ : ఈ ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు వినియోగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదును ఒకేసారి గానీ లేదా విడతల వారీగా గానీ ఏదేని ఒక ఖాతాలో జమ చేసినా, విత్ డ్రాల్ చేసినా పాన్ వివరాలు ఇక పై తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. స్థిరాస్తులైన ఇళ్లు, ఇళ్ల స్థలాల కొనుగోలు,అమ్మకం,బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ.20లక్షలు దాటినా కూడా ఇకపై పాన్ తప్పనిసరి చేసింది. అంతే కాదు ఏదయిన కొత్త మోటారు వాహనం కొనుగోలు చేసిన పక్షంలో , దాని ధర రూ. 5 లక్షలు మించితే కూడా కొనుగోలుదారుడు పాన్ కార్డు విధిగా సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది.
