ఆడినం.. పాడినం.. అన్నట్లు కాదు
అభివృద్ధి చేశామా? లేదా? అన్నదే ముఖ్యం
స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి


జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: రెండేళ్లలో కుర్చపల్లి గ్రామాభివృద్ధికి రూ. 4 కోట్ల నిధులు ఇచ్చానని, వీటిలో 85 లక్షల సిసి రోడ్లు ఉన్నాయని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కుర్చ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మొదటగా ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, ఆ తర్వాత సిసి రోడ్లను, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజల ఉద్దేశించి మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు ఏళ్ళు మాత్రమే అవుతుందని ఈ రెండేళ్ల కాలంలో గ్రామంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పటివరకు సిసి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లుకు అధకంగా నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రూ. 2.24 కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మాణం చేసుకోవడం జరిగిందని,ఇక రైతుల విద్యుత్ కష్టాలు తొలగినట్లేనని ఆయన చెప్పారు. ఒకప్పుడు కుర్చపల్లి గ్రామం జనగామ నియోజకవర్గంలో ఉండేదని, 2009 డీలిమిటేషన్ తరువాత స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కలిసిందని, ఆ తర్వాత 15 ఏళ్ళు పసలేనివాడు, పనికిరాని వాడు, అధికారంలో ఉండి గ్రామాభివృద్ధిని అస్సలు పట్టించుకోలేదని పరోక్షంగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యనుద్దేశించి ఘాటుగా విమర్శించారు. 15 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశాడో? ప్రజలే ఆలోచించుకోవాలని,నిరుపేదలకు ఒక ఇల్లు ఇవ్వలేదు, గ్రామాభివృద్ధికి పాటుపడలేదు ఆడినం.. పాడినం..తిన్నాం..ఉన్నాం అన్నట్లుగా వ్యవహరించి పబ్బం గడిపాడే తప్ప పేద ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యేలన ఉద్దేశించి మండిపడ్డారు అలాంటి వ్యక్తుల కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటు బడిపోయిందని,ఇప్పుడు ఆ భారం నా మీద ఉందని, దాన్ని సవరించుకోవడానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1400 కోట్లు తనకు అభివృద్ధి పనుల కోసం ఇచ్చాడని,అభివృద్ధి చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ‘తాను పబ్బం గడుపుకునే వాన్ని కాదని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా.. పైసా కమిషన్ తీసుకోకుండా.. నిక్కచ్చిగా పనిచేస్తానని’ గ్రామానికి గోదావరి జలాలను తీసుకొచ్చి తీరుతానని ఆయన స్పష్టం చేశారు. గ్రామంలో రైతును కష్టించి పని చేసే స్వభావం ఉన్నవారు ఉన్నారని అయినా అభివృద్ధి జరగలేదని రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేస్తూ ముందుకు వెళ్తానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ బైకాని రాజు,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి,జనగామ మార్కెట్ డైరెక్టర్ తోటకూరి రమేష్,మాజీ సర్పంచ్ మినుకూరి దేవేందర్ రెడ్డి,ఉప సర్పంచ్ రాములు, డిపిఎం జన్ను ప్రకాష్,ఏపీఎం నిర్మల,సిసి రమాదేవి, డ్వాక్రా కమిటీ సభ్యులు సునిత,శోభ, అనూష స్వరూప,శ్యామల,రజిత,అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పానుగంటి అశోక్,విజయ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోళ్ల రవి,నాయకులు మేకల నరేందర్,గాదే మహేందర్ రెడ్డి,నామాల బుచ్చయ్య,పలువురు వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
