రోడ్డుకు అడ్డంగా బైక్ మెకానిక్ షాప్!

ఇబ్బందుల్లో ప్రజలు చోద్యం చూస్తున్న అధికారులు లీడ్స్,రఘునాథపల్లి: మరీ ఇంత అద్వానమా? అధికారులు పట్టించుకోవడం లేదా? వారంటే వీళ్లకు లెక్క లేదా? రోడ్డుకు అడ్డంగా షాపులు నిర్వహించడం ఏంటి? ఈ బైక్ పాయింట్ నిర్వాహకుల తీరు చూస్తే మాత్రం నిబంధనలను వీరు పూర్తిగా పాతరేసినట్లు స్పష్టం అవుతుంది. వివరాల్లోకి వెళితే.. రఘునాథపల్లి మండల కేంద్రంలో హనుమకొండ నుండి జనగాం వెళ్లే సర్వీస్ రోడ్డులోని మదీనా మసీదు పక్కన  బైక్ రిపేర్ పాయింట్ నిర్వాకులు రోడ్డుకు అడ్డంగా వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు...