రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తత అవసరం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లీడ్స్, జనగామ ప్రతినిధి : రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక,అరైవ్ - అలైవ్, రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం,మొబైల్ ఫోన్ వినియోగం...