లంచం అడిగితే సస్పెన్షన్‌

‘కోడ్‌’లు వాడితే చర్యలు కార్యాలయ సీసీ కెమెరాలన్నీ పనిచేయాలి రవాణాశాఖ విజిలెన్స్‌ జేటీసీ చంద్రశేఖర్‌ హైదరాబాద్‌, లీడ్స్ న్యూస్ : రవాణా శాఖలో అవినీతి దళారులు, సిబ్బంది ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లపై, సీఎంవో ఆరా నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. ఏజెంట్ల నుంచి లంచాలు తీసుకునే సిబ్బందిని తక్షణమే సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. అవినీతికి సంబంధించి ఉపయోగిస్తున్న ‘కోడ్‌’లకు స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రవాణా శాఖ కార్యాలయాలకు ప్రధాన కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈమేరకు.. టెస్టింగ్‌...