మారనున్న నియోజకవర్గాల నైసర్గిక స్వరూపం
దేశంలో 543 నుంచి 816కు లోక్ సభ స్థానాలు
తెలంగాణలో 179, ఏపీలో 263 అసెంబ్లీ సెగ్మెంట్ల పెంపు
ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే యోచనలో కేంద్రం
అంతకు ముందుగా తేల్చనున్న మహిళా రిజర్వేషన్ల బిల్లు.
ఎన్డీఏ పక్షాలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చర్చ
హైదరాబాద్,లీడ్స్ న్యూస్
అన్ని రాష్ట్రాల లోక్ సభ, అసెంబ్లీ స్థానాలు 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశంలోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. సోమవారం సాయంత్రం నిర్వహించిన ఎన్.డి.ఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం సూచనప్రాయంగా చెప్పేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజూజీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రావు మేఘాల నేతృత్వంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరుతాయి. దేశంలో 4,123 అసెంబ్లీ స్థానాలు 6,185 స్థానాలు అవుతాయి తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179 కి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కు చేరనున్నాయి. లోక్ సభ స్థానాలు తెలంగాణలో 17 నుంచి 26కు, ఏపీలో 25 నుంచి 38కి పెరిగే అవకాశం ఉంది. మొదటగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన కేంద్రం, త్వరలో ఈ విషయమై కాంగ్రెస్,ఇతర విపక్షాలతోనూ బేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో నియోజకవర్గ స్థానాలను పెంచడానికి ముందుగానే మహిళా రిజర్వేషన్ చట్టం, డిలిమిటేషన్ చట్టాలకు సవరణ ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకురాబోతున్నట్లు తెలిసింది. లోక్ సభ ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు ప్రక్రియ పూర్తి చేసి 2029 ఎన్నికల్లో దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. సీట్ల పెంపు విషయం జనాభా ఆధారంగా ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని తెలుస్తుంది. 2023 సెప్టెంబర్ లో ఆమోదించిన బిల్లు ప్రకారం 2034 నుంచి మహిళలకు 33% రిజర్వేషన్లు అమలులోకి రావాలి,రాజ్యాంగ సవరణలు 170(3), 81(3) ప్రకారం 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల మహిళా రిజర్వేషన్ల అమలును 2034 నుంచి అమల్లోకి తేనుంది. వచ్చే నెలలో చేపట్టనున్న జన గణన 2027 మార్చి 1వ తేది కల్లా పూర్తి కానుండడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా ఈ అంశంపై అన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కేంద్రం మొదలు పెట్టింది. దీనిలో భాగంగా మొదటగా ఎన్డీఏ మిత్రపక్షాలతో ఈ విషయాన్ని షేర్ చేసుకుని, ఆ తర్వాత కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పక్షాలతో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అసెంబ్లీ,పార్లమెంటు నియోజక వర్గాల్లో చాలా చోట్ల మండలాలు,జిల్లాలు వేరువేరు స్థానాల్లో ఇమిడి ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ఈ డీలిమిటేషన్లో సవరించి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకే పార్లమెంటు పరిధిలోకి ఒక జిల్లాలోని మండలాలు,ఒక మండం లోని గ్రామాలను తీసుకువచ్చే అవకాశాలు కూడ లేకపోలేదు. దీనికి తోడు రాజకీయ నిరుద్యోగతను తొలగించడంతో పాటుగా ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న డీలిమిటేషన్ పెరిగితే సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున అన్ని పార్టీలు దీనిపై కలిసి వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతుంది. రాజకీయపరంగా ఇది ఒక రకంగా శుభ పరిణామం అని చెప్పు. ఎందుకంటే ఎంతోకాలంగా ఎలాంటి పదవులు లేకుండా పార్టీని అడ్డుపెట్టుకొని ఉండే రాజకీయ నిరుద్యోగులకు ఈ బిల్లింగ్ స్టేషన్ తో అవకాశాలు దక్కే ఛాన్స్లేఎక్కువగా కనిపిస్తున్నాయి.
