వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనగామ,లీడ్స్ న్యూస్: ఎల్‌నీనో ప్రభావం కారణంగా ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని దీన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు రాష్ట్ర రెవిన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కలెక్టరేట్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ తో కలిసి ఆయన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,కలెక్టర్లతో  వర్షాభావ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశమంతా...