
రఘునాథపల్లి లీడ్స్ న్యూస్: రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ ఇన్పుట్ డీలర్లకు స్థానిక ఏవో కర్ణాకర్ రెడ్డి సూచించారు. బుధవారం ఆయన స్థానిక రైతు వేదికలో డీలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. డీలర్లు వారి లైసెన్స్ లను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని, నకిలీ విత్తనాలు, విక్రయించరాదని, అలా నకిలీ విత్తనాల విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఈవో, పలువురు ఫర్టిలైజర్ షాప్ యజమానులు,డీలర్లు, పాల్గొన్నారు.