teluguleads.in
Newspaper Banner
Date : 03 March 2026, 7:40 pm Posted By : TELUGU LEADS

వీడిన చంద్రగ్రహణం

హైదరాబాద్ (లీడ్స్ న్యూస్) : మన దేశంలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6.47కు గ్రహణం ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణాన్ని 6.20 నుంచి గ్రహణం ముగిసే వరకు వీక్షించారు. ఇక మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 27 నిమిషాల పాటు ఈ గ్రహణాన్ని ప్రజలు వీక్షించారు. గ్రహణం కారణంగాతెలుగు రాష్ట్రాల్లో పలు దేవాలయాలు మూతపడ్డాయి. తిరిగి సంప్రోక్షణ తర్వాత వాటిని తెరుస్తారు. చంద్రగ్రహణం ప్రభావం ప్రజలపై ఏమి ఉండదని, అదంతా అపోహ మాత్రమేనని శాస్త్రవేత్తలు సందర్భంగా వ్యాఖ్యానించారు.