వ్యవసాయం,విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యం

దేవాదుల ప్రాజెక్టుతో సాగులో అభివృద్ధి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వ దృష్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క జనగామ ప్రతినిధి, లీడ్స్ న్యూస్: వ్యవసాయ,విద్యుత్తు అవసరాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు మల్లు బట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని పలు నూతన సబ్ స్టేషన్ లకు శంకుస్థాపనలు చేశారు. అలాగే మరికొన్నింటిని ప్రారంభించారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ల కోసం రూ.60.62 కోట్లు కేటాయించినట్లు...