teluguleads.in
Newspaper Banner
Date : 09 May 2026, 12:33 pm Posted By : TELUGU LEADS

వ్యాపారులకు నోటీసులు

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి గ్రామంలో బస్టాండ్ నుండి బ్రిడ్జి చివరి వరకు ఇరువైపున  ఫుట్పాత్ లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి గ్రామపంచాయతీ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. వ్యాపారస్తులు వారి షాపుల ముందు ఉన్న ఫుట్పాత్ ను ఆక్రమించడం వల్ల ప్రజలకు వచ్చి పోయే వాహన దారులకు తీవ్ర ఇబ్బంది కడుగుతుండడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు పంచాయతీ కార్యదర్శి బాలకిషన్ తెలిపారు. ఫుట్ పాత్ ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారందరూ వెంటనే సెట్ బ్యాక్ కావాలని లేనిపక్షంలో పెనాల్టీలు అమలు చేస్తామని తెలిపారు. నోటీసులను ఖాతరు చేని వారిపై చర్యలు తప్పవని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా తమ వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు.