teluguleads.in
Newspaper Banner
Date : 20 July 2026, 7:02 pm Posted By : TELUGU LEADS

శానిటరి హౌస్ కి శంకుస్థాపన

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: రఘునాథపల్లి మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం ఎదురుగా మునుపటి బంజరు దొడ్డి స్థలంలో మూడు లక్షలతో చేపట్టే సానిటరీ హౌస్ కి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, గ్రామ సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్ లు సోమవారం శంకుస్థాపన చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టే ఈ పనుల్లో స్త్రీ, పురుషుల కోసం వేరువేరుగా రెండు పబ్లిక్ టాయిలెట్స్ ని నిర్మించనున్నారు. దేవాలయానికి వచ్చే వారికోసం,అలాగే స్థానిక ప్రజల కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయని వారు ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లింగాల జగదీష్ చందర్ రెడ్డి,జడ్పీ ఇన్చార్జి సీఈవో సూరి,ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ దావరి యాకయ్య, పంచాయతీ కార్యదర్శి బాలకిషన్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, స్థానిక దేవాలయ చైర్మన్ కూరెల్లి పెద్ద ఉపేందర్,మార్కెట్ డైరెక్టర్ ఎండీ. భాష్మియా, నామల బుచ్చయ్య, స్థానికులు బొట్ల రాజు,మహేందర్,మహిళా సంఘము ప్రతినిధి ఇమ్మడిశెట్టి అనిత, పూజారి తమ్మలి శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.