శ్రీ రేణుక ఎల్లమ్మకు గాజుల అలంకరణ

జనగామ, లీడ్స్ న్యూస్: జనగామ పట్టణం 3వ వార్డు బాలాజీనగర్‌ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక మహిళలు రేణుక ఎల్లమ్మ తల్లికి గాజులు అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారు మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారిని గాజులతో అలంకరించి గాజుల పూజ,మంగళగౌరి పూజ,సహస్ర కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ పూజారి మారుపాక శాంప్రసాద్ అనంతరం మహిళా భక్తులకు పసుపు, కుంకుమ,బొట్టు, గాజులను పంపిణీ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దూడల శోభారాణి,...