teluguleads.in
Newspaper Banner
Date : 21 August 2026, 9:13 pm Posted By : TELUGU LEADS

సిగ్గు,శరం ఉంటే ఇంట్లో పడుకో!

చిన్నా రెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫైర్

లీడ్స్,హైదరాబాద్: డబ్బులకు బీఫాంలు అమ్ముకున్నాడని సిఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ అధిష్టానంపై చిన్నారెడ్డి దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సిగ్గు చెటని కాంగ్రెస్ పార్టీ వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి మండిపడ్డారు. నీవు
8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చావో చెప్పాలని అయన డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ప్రెస్మీట్లో మాట్లాడుతూ ‘నీకు
సిగ్గు,శరం ఉంటే ఇంట్లో పడుకో’.. లేదంటే పార్టీ ఎలాగూ సస్పెండ్ చేస్తుందని చిన్నారెడ్డిని ఉద్దేశించి అయన అన్నారు. నీకు టికెట్ ఇవ్వకపోతే పార్టీ తప్పు చేసినట్టేనా? అని అయన సూటిగా ప్రశ్నించారు. నీకు టికెట్ ఇవ్వకపోతే  పార్టీపై బురద చల్లుతావా అని అన్నారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.