సీసీ టీవీలతో నేరాల నియంత్రణ

వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: గ్రామాల్లో సీసీటీవీ లను ఏర్పాటు చేసుకున్నట్లయితే నేరాల నియంత్రణకు దోహదం చేస్తాయని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఆదివారం ఆయన జనగాం మండల పరిధిలోని ఆయా గ్రామాల సర్పంచులు,ఉపసర్పంచులతో జనగామ పోలీస్ స్టేషన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజా ప్రతినిధులకు సీసీటీవీలో ప్రయోజనాన్ని వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ టీవీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. సీసీటీవీ కెమెరాలతో గ్రామాల్లో భద్రత మరింత బలోపేతం...