teluguleads.in
Newspaper Banner
Date : 19 March 2026, 8:34 pm Posted By : TELUGU LEADS

హరీష్ రావు బాటలో స్పీకర్ ప్రసాద్ కుమార్

రైతు సదస్సులో మాట్లాడుతున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

సిద్దిపేట,(లీడ్స్ న్యూస్): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పామాయిల్ పంటను సాగును ప్రోత్సహించినట్లుగానే తాను కూడా ఈ పంట వేసేందుకు తన నియోజకవర్గంలో రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో ఎన్నో లాభాలు ఉన్నాయని అయితే సిద్దిపేటలో ఇప్పటికే చాలామంది రైతులను తన్నీరు హరీష్ రావు ప్రోత్సహించి ఈ పంటను వేయించాడని ఆయన అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రజాపాలన – రైతు ఉత్సవాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. లక్ష కోట్ల టన్నుల మేరా మనం పామాయిల్ ను దిగుమతి చేసుకుంటున్నామని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ పంటను ఎంత పండించిన ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రోత్సహిస్తుందని చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకుఎంతో ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తుందని రైతులు ఈ పంట వేసి లాభాలు పొందాలని,నాలుగేళ్లలోనే ఆదాయం వస్తుందని తాను కూడా స్వయంగా ఈ పంటను వేశానని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా మొత్తం 150 స్టాల్ ను వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసింది. ఈ సదస్సు నర్మెటలో మూడు రోజుల పాటు జరుగుతుందని, రైతులు ఈ సదస్సుకు హాజరై అవగాహన పెంపొందించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో గందరగోళం సృష్టించారు. సభ ప్రారంభంలో కాస్త ఇబ్బంది పెట్టిన ఒకవైపు హరీష్ రావు, మరోవైపు పొన్నం ప్రభాకర్ వారిని వారించి సభను సజావుగా నడిచేందుకు కృషి చేశారు. ఈనెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ సంబంధించి ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు కూడా నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వాకాటి శ్రీహరి, రాష్ట్ర రైతు కమిషన్ అధ్యక్షులు కోదండ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, ఎంపీ, రఘునందన్, రాష్ట్ర ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి,తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా రైతులు తరలివచ్చారు.