కేటీఆర్
హైడ్రా 9 తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది
ఇంతకంటే చెంపపెట్టు ఒక ముఖ్యమంత్రికి ఏం ఉంటది?

హైదరాబాద్,లీడ్స్ న్యూస్: మా ప్రభుత్వం వచ్చినా మరుసటిరోజే హైడ్రా నెత్తి బంగాళాఖాతంలో పడేస్తాం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ అన్నారు. నిన్న హైదరాబాద్ లో అయన విలేకరులతో మాట్లాడుతూ బడా బాబులను పట్టించుకోకుండా గరీబోళ్ల ఇళ్ల మీద పడి కూల్చేస్తుందని సర్కారుపై మండిపడ్డారు. మంత్రి పొంగులేటి ఇల్లు చెరువులో ఉంటే దన్ని హైడ్రా ముట్టదు, ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు ఉంటే దాన్ని హైడ్రా ముట్టడు,వివేక్, సుఖేందర్ రెడ్డి ఇల్లు చెరువులో ఉన్న హైడ్రా వాళ్ళను ముట్టదు ఇదెక్కడి న్యాయం అని ప్రశించారు. దీని వెనక పెద్ద కుట్ర కోణం ఉందని అయన ఆరోపించారు. కబ్జాకోరులు అంటున్నావు అందరికంటే ఎక్కువ దోచుకున్నది,నీ సోదరులు,నీ మంత్రులే కదా అని అయన అన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టింది నీ మంత్రులు కాదా? అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయేసరికి 16 లక్షల ఎకరాల నిషేధిత భూములు ఉంటే ఇవాళ అది కోటి ఎకరాలకు ఎలా చేరిందని ప్రశ్నించారు.