teluguleads.in
Newspaper Banner
Date : 09 May 2026, 11:54 am Posted By : TELUGU LEADS

హ్యాట్సాఫ్ మోదీజీ!

హైదరాబాద్ లీడ్స్ న్యూస్ : మోదీ నిగర్వి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. దేశ ప్రధాని హోదాలో ఉండి ఓ సీనియర్ నేత కాళ్లకు నమస్కరించడం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. అది ఎక్కడో కాదు. శనివారం పశ్చిమ బెంగాల్‌లో భాజపా నేత సువేందు అధికారి సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేదికపై ఉన్న ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆయన ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయన పేరు మఖన్‌లాల్‌ సర్కార్‌. భాజపా అత్యంత సీనియర్‌ నేతల్లో మఖన్‌లాల్‌ ఒకరు. 1952లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీతో పాటు కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొని అక్కడ భారత జెండా ఎగురవేసిన ఘటనలో జైలుకెళ్లారు. ప్రస్తుతం ఆయన వయసు 98 ఏళ్లు. ఎంత ఎదిగిన పెద్దల ముందు ఒదిగి ఉండాలి అని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. చిన్నపాటి పదవి వస్తేనే భారీ కిరీటంగా భావించి అహంకారాన్ని తలకెక్కించుకునే వ్యక్తులు ఉన్న ఈ రోజుల్లో మోదీ శిరసు వంచి పాదాభివందనం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.