హ్యాట్సాఫ్ మోదీజీ!

హైదరాబాద్ లీడ్స్ న్యూస్ : మోదీ నిగర్వి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. దేశ ప్రధాని హోదాలో ఉండి ఓ సీనియర్ నేత కాళ్లకు నమస్కరించడం ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. అది ఎక్కడో కాదు. శనివారం పశ్చిమ బెంగాల్‌లో భాజపా నేత సువేందు అధికారి సీఎంగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వేదికపై ఉన్న ఓ వృద్ధుడి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో ఆయన ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆయన పేరు మఖన్‌లాల్‌...