teluguleads.in
Newspaper Banner
Date : 25 July 2026, 7:06 pm Posted By : TELUGU LEADS

33కేవీ ఇంటర్‌లింక్ లైన్‌ ప్రారంభం

తొలగనున్న ఇబ్బందులు

టీజీఎన్‌పీడీసీఎల్ ఆపరేషన్స్ డైరెక్టర్ టి. మధుసూదన్

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ ను అందించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ చేపడుతున్న మౌలిక సదుపాయాల్లో భాగంగా శనివారం ఓ ప్రత్యామ్నాయ లైన్ ను ఆ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ టీ. మధుసూదన్ రఘునాథపల్లిలో ప్రారంభించారు. ఇదీ 33కేవీ జనగామ ఫీడర్ నుండి 33/11 కేవీ నిడిగొండకు, అక్కడి నుండి రఘునాథపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్ కు పవర్ సరఫరా కానుంది. ఇకపై రఘునాథపల్లిలో ఏదయినా అంతరాయం ఏర్పడినట్లయితే ఈ లైన్ ద్వారా ప్రత్యామ్నాయ పవర్ సప్లై జరుగుతుంది. అదేవిధంగా జనగామ, నిడిగొండకు కూడా ఈ లైన్ సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో రఘునాథపల్లి నుండి కూడా విద్యుత్ సరఫరా చేయనున్నారు. దీంతో రఘునాథపల్లి, జనగామ,నిడిగొండ 33/11 కేవీ వినియోగదారులకు కరెంటు కష్టాలు తగ్గనున్నాయి. ప్రజలకు ఈ కార్యక్రమంలో జనగామ ఆపరేషన్ సర్కిల్ ఎస్.ఈ చెరుకు సంపత్ రెడ్డి,జనగామ కన్‌స్ట్రక్షన్ ఏడీఈ ఎ. స్వామిరెడ్డి,ఆపరేషన్ ఏడీఈ సుధాకర్, రఘునాథపల్లి ఏఈ టి.రమేష్,కన్‌స్ట్రక్షన్ జనగామ ఏఈ రాహుల్ ఇతర ఆపరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.