Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedరెండు కుటుంబాల్లో విషాదం ఇద్దరు యువకులు మృతి

రెండు కుటుంబాల్లో విషాదం ఇద్దరు యువకులు మృతి

📰 Generate e-Paper Clip

జనగామ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): ఒక్క ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. మంగళవారం సాయంత్రం జనగామ పట్టణంలోని నెహ్రు పార్క్ ఫ్లై ఓవర్ పై అశోక్ లీవ్ ల్యాండ్ గూడ్స్ వాహనం,బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జనగామ జ్యోతి నగర్ కు చెందిన మరాఠీ దినేష్ (22) వడ్లకొండకు చెందిన బాల్దే ధనుష్ (20)లతో పాటు మరొకరు తీవ్రంగా గాయపడగా ముగ్గురిని వరంగల్ ఎంజిఎంకు తరలించారు. దినేష్, ధనుష్ లు చికిత్స పొందుతూ మృతి చెందారు. అశోక్ లీవ్ ల్యాండ్ గూడ్స్ వాహనం డ్రైవర్ శివ కృష్ణ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ చెన్నకేశవులు, ఇతర పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments