Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedరాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి

రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

లీడ్స్ ప్రతినిధి,హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి ఇద్దరినీ రాజ్యసభకు పంపనుంది.ఇప్పటికే పార్టీ అధిష్టానం సీనియర్ నాయకులు అభిషేక్ సింగ్వి పేరును ఖరారు చేసింది. అలాగే రెండో వ్యక్తిగా ప్రభుత్వ సలహా దారుడు వేం నరేందర్ రెడ్డిని కూడా ఎంపిక చేసింది. వేం నరేందర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. 2015 మంచి వీరిద్దరూ మంచి స్నేహితులు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయడం కోసం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నట్లు ప్రచారం జరుగుతుంది. అప్పటినుంచి వీరి స్నేహం బలంగా ఉంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏకంగా నరేందర్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారులుగా నిర్మించారు. రెండేళ్లుగా నరేందర్ రెడ్డి ఆ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు అన్నీ తానై ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి బాసటగా నిలిచారు. అందువల్లే ఆయన్ని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో కూడా తీవ్రంగానే పోరాటం చేసినట్టు తెలుస్తుంది. వేరే వ్యక్తిని పంపాలని అధిష్టానం భావించినప్పటికీ పట్టుబట్టి అటు రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా ఒప్పించి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. దివంగత ముఖ్య మంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిత్రులుగా ఉన్న కెవిపి రామచంద్రరావును ఆయన ఆత్మగా భావంచి రాజ్యసభకు పంపితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆత్మగా పేరొందిన వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభకు ఎంపిక కావడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments