రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


వరంగల్ ప్రతినిధి,(లీడ్స్ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై మహబూబాబాద్ ఐడీఓసి కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 12వ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలిన్నారు. విద్యా, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. జిపిఆర్ఎస్ ద్వారా పాఠశాల వాహనాలు పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
స్లమ్ ఏరియాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని, ఉందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి,ఎక్కడైనా నిధులు మంజూరు సమస్య ఉంటే నివేదికలు పంపాలని తెలిపారు. ప్రతి హస్టల్ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించి తనిఖీలు చేయాలని, విద్యార్థులతో కలిసి భోజనాలు చేయాలని తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాభితా తయారు చేయాలని తెలిపారు. మార్చి నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని,గ్రౌండ్ కాని ఇండ్లు లబ్ధిదారుల నుండి అంగీకారాన్ని తీసుకుని రద్దు చేయాలని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార స్థితిని దరఖాస్తుదారులు తెలుసుకునేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి సమాచారం వారి సెల్‌ఫోన్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలికల వసతి గృహాల్లో ఇన్సినిరేటర్లు ఏర్పాటు చేయాలని, మండల స్థాయిలో ఆరోగ్య సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మిల్సి రవీందర్ రావు,శాసన సభ్యులు మురళి నాయక్,దొంతి మాధవరెడ్డి,రాజేందర్ రెడ్డి, నాగరాజు,రేవూరి ప్రకాష్ రెడ్డి,వరంగల్ మేయర్ గుండు సుధారాణి,కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి,
ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
