Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedప్రైవేట్ బస్సుకు ఘోర ప్రమాదం

ప్రైవేట్ బస్సుకు ఘోర ప్రమాదం

📰 Generate e-Paper Clip

టిప్పర్ లారీని ఢీకొన్న బస్సు

క్షణాల్లో చెలరేగిన మంటలు

12 మంది సజీవ దహనం

హైదరాబాద్, లీడ్స్ ప్రతినిధి

ఏపీలోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ట్రావెల్స్ కి చెందిన ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చేయలేగాయి. గురువారం ఉదయం 5 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో 12 మందికి పైగా సజీవ దహనం అయినట్లు తెలుస్తుంది. నిర్మల్ నుండి కనిగిరి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలు లారీని కూడా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.  క్షతగాత్రులందరినీ మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మృతులు ఎవరనేది  ఇప్పటివరకు తెలియలేదు. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తక్షణమే సహయాక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను, మృతుల సంఖ్య వంటి వివరాలపై పూర్తి సమాచారం ఇవ్వాలని, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ ప్రమాదంపై స్పందిస్తూ దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని, మృతులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments