Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedమత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు

మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: మత్తు పదార్థాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ లతో కలిసి ఆయన మత్తు పదార్థాల నియంత్రణ, విద్యా,వ్యవసాయ,ఎక్సైజ్, పోలీసు,వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల నివారణపై పెయింటింగ్,వ్యాస రచన పోటీలు నిర్వహించి, విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. రైల్వే స్టేషన్,బస్టాండ్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని, దాబాల వద్ద ప్రత్యేక దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు.
యువత మత్తుకు బానిస కావొద్దని,ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు.
ఈ సమీక్షలో డీఏఓ అంబికా సోనీ, ఎక్సైజ్ ఎస్పీ అనిత,ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్,డీఎంహెచ్ఓ మల్లిఖార్జున రావు,ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments