స్టేషన్ ఘన్పూర్ ఏసిపి భీమ్ శర్మ

రఘునాథపల్లి,లీడ్స్ న్యూస్: ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని..ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని స్టేషన్గన్పూర్ ఏసిపి భీమ్ శర్మ, రఘునాథపల్లి రూరల్ సిఐ ఎడవెల్లి శ్రీనివాసరెడ్డిలు సూచించారు. 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి పాలన, అరైవ్..అలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం కుర్చపల్లి, కోమల్ల గ్రామాల్లో రఘునాథపల్లి ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు నిబంధనలు పాటిస్తామని, తప్పకుండా హెల్మెట్లు ధరిస్తామని,కార్ వంటి వాహనాలు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరిస్థామని, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, తోటి ప్రజలను కూడా ఇదే విషయంలో చైతన్య పరుస్తామని సీఐ శ్రీనివాస్ రెడ్డి ప్రజలతో ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమంలో కుర్చపల్లికోమల్ల గ్రామ సర్పంచులు బైకాని రాజు,వల్లాల అశోక్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు.
