Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedఅవగాహనతో ఉంటే ప్రమాదాల నివారణ

అవగాహనతో ఉంటే ప్రమాదాల నివారణ

📰 Generate e-Paper Clip

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్

జనగామ ప్రతినిధి,లీడ్స్ న్యూస్: ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించి ప్రయాణించే రోడ్లపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి పాలన 99 రోజుల కార్యక్రమం, అర్రైవ్.. అలైవ్ లో భాగంగా మంగళవారం సిద్ధిపేట రోడ్డులోని చంపక్ హిల్స్ సమీపంలో ఎంసీహెచ్ ఆసుపత్రి మూల మలుపులో రోడ్డు గుంతలు పడి ప్రమాదకరంగా ఉండడంతో పోలీసులు మరమ్మత్తులు చేసి గుంతలను పూడ్చివేశారు. గుంతల మయమైన రోడ్డు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ రాజిరెడ్డితో మాట్లాడి వెంటనే సదరు గుంతలను పూడ్చి వేసినట్లు  డీసీపీ చెప్పారు. ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా, వారిని చైతన్య పరచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇందులో భాగంగానే రోడ్లపై గుంతలను పూడ్చివేయడం జరిగిందని చెప్పారు. అయితే, స్వయంగా డీసీపీ దగ్గరుండి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టడం గమనార్హం. ఆయన వెంట జనగామ ఏసీపీ పాండరే చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్సైలు భరత్,రథీష్, ఎస్సై చెన్నకేశవులు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments