Tuesday, April 28, 2026
No menu items!
HomeUncategorizedఇద్దరు దొంగల అరెస్ట్

ఇద్దరు దొంగల అరెస్ట్

📰 Generate e-Paper Clip

జనగామ,లీడ్స్ న్యూస్: దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను శుక్రవారం జనగామ పోలీసులు రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకొన్నారు. ఏసిపి పండరి చెప్పిన కథనం ప్రకారం. గరిమెల్లి సత్యనారాయణ మిడిదొడ్డి మండలం కొండాపూర్ గ్రామస్తుడు కాగా, మరో వ్యక్తి గొడుగు నాగరాజు చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన వాడు. మీరిద్దరూ సిద్దిపేట జిల్లాకు చెందినవారు. ఫ్లవర్ డెకరేషన్ వృత్తిని చేసుకుంటూ పలుచోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. వీరి నుండి 28 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రు 4.5 లక్షలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సిఐ సత్యనారాయణ రెడ్డి ఎస్ఐ భరత్, పోలీస్ సిబ్బంది తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసులను ఈ సందర్భంగా వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్, డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments